సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేముల గట్టు శివారులో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి మల్లన్న సాగర్ జలాశయం కట్ట వర్షపు నీటికి కొట్టుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తోంది.
Mallanna Sagar: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన మల్లన్న సాగర్ కట్ట - కొట్టుకుపోయిన మల్లన్న సాగర్ కట్ట
గురువారం కురిసిన భారీ వర్షాలకు మల్లన్న సాగర్ కట్ట కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేముల గట్టు శివారులో జలాశయ కట్ట నిర్మాణం దెబ్బతింది. దీంతో పనుల్లో నాణ్యతపై పలు విమర్శలు వస్తున్నాయి.
భారీ వర్షానికి కొట్టుకుపోయిన మల్లన్న సాగర్ కట్ట
వర్షపు నీరు ప్రవాహానికి జలాశయ కట్ట నిర్మాణం దెబ్బతింది. దీంతో పనుల్లో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మల్లన్నసాగర్ ఎస్సీ వేణును వివరణ కోరగా వరదకు దెబ్బతిన్న చోట నిర్మాణం పటిష్టంగా చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:టీకా తీసుకుంటే ఎఫ్డీపై అధిక వడ్డీ!
Last Updated : Jun 8, 2021, 3:52 PM IST