సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ పనులను తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు అడ్డుకున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను లెక్కచేయకపోవడం ఏంటని...రైతులు పనులకు అడ్డుగా నిలిచారు. పరిహారం చెల్లించకుండా బలవంతంగా పనులు చేపడుతున్నారంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పరిహారం, పునారావాస ప్యాకేజీ అందించాకే పనులు ప్రారంభించాలని ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మల్లన్నసాగర్ పనులను అడ్డుకున్న రైతులు - mallannasagar project latest news
మల్లన్నసాగర్ పనులను ఏటిగడ్డ కిస్టాపూర్ రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని ఆందోళన చేశారు.
మల్లన్నసాగర్ పనులను అడ్డుకున్న రైతులు