maharastra formers visits telangana: సిద్ధిపేట జిల్లాలోని ముఖ్యమంతి నియోజకవర్గమైన గజ్వేల్‌లో మహారాష్ట్ర రైతు బృందం పర్యటించింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడాలని మహారాష్ట్ర రైతులను కేసీఆర్ కోరారు. ఆయన కోరిక మేరకు వారు గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడటానికి వచ్చారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో మహారాష్ట్ర రైతు బృందం పర్యటించింది. సీఎం కేసీఆర్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడాల్సిందిగా మహారాష్ట్ర రైతులను కోరగా దీంతో వారు ప్రత్యేక బస్సుల్లో 150 మంది రైతుల బృందం సభ్యులు గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసేందుకు వచ్చారు. మొదటగా ములుగులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలను పరిశీలించారు అనంతరం వర్గల్ మండలం సింగరాయపల్లి గ్రామంలో అటవీ అభివృద్ధి పనులను చూశారు. అక్కడి నుంచి గజ్వేల్ పట్టణానికి చేరుకొని అధునాతన సమీకృత మార్కెట్ ను సందర్శించారు. అక్కడనుండి బయలుదేరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోమటిబండ వద్ద ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను సందర్శించింది మహారాష్ట్ర రైతు బృందం. వీరి వెంట ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మహారాష్ట్ర బృందానికి వీరు వివరించారు.