ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, రైతును రాజు చేయాలనే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పని చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మాదాసు అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్‌గా సుధాకర్‌లతో మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎంపీ హాజరయ్యారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
ఉద్యమ సమయంలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రరేపించి కీలకపాత్ర పోషించిన కార్యకర్తకు పదవి దక్కడం సంతోషంగా ఉందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, ఎంపీలకు అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.