విద్యార్థుల్లో చిన్నవయసు నుంచే ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు చిన్మయ మిషన్ కృషి చేస్తుందని జగదేవపూర్ చిన్మయ మిషన్ పీఠాధిపతులు యజ్ఞానందస్వామి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిని 4 గ్రూపులుగా విభజించి గీతాపఠనం చేయించారు. విద్యార్థులు న్యాయనిర్ణేతల ముందు గీతాపఠనం చేసి, వాటి తాత్పర్యాలను వివరించారు.
జగదేవ్‌పూర్‌లో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు - latest news on Lyrics of Jagadevpur state level competitions
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు.
జగదేవ్‌పూర్‌లో గీతాపఠనం రాష్ట్ర స్థాయి పోటీలు
పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 6 వేలు, తృతీయ బహుమతిగా రూ.4 వేల నగదు పురస్కారాలను అందజేశారు. దాంతో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఇవీ చూడండి: 1500 మంది పర్యటకులను కాపాడిన భారత సైన్యం