సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
పోతారం గ్రామానికి చెందిన చెప్యాల రఘు, చెప్యాల ఉదయ్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరు సొంత అన్నదమ్ముల కుమారులు. యువకుల మృతితో పోతారంలో విషాద ఛాయలు అలముకున్నాయి.