తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి - విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మడదలో విద్యుదాఘాతానికి గురై లారీ డ్రైవర్​ మృతి చెందాడు.

lorry driver died of electric shock in siddipet district
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

By

Published : Dec 27, 2019, 3:09 PM IST

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మడద కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలు లోడ్​ చేసుకుని వెళ్తుండగా.. లారీకి డిష్​ వైర్​ తగిలింది. దానిని తప్పించేందుకు యత్నిస్తుండగా.. లారీ డ్రైవర్​ నాగరాజుకు విద్యుత్​ తీగలు తగిలాయి.

కరెంట్​ షాక్​ తగిలి నాగరాజు లారీపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details