సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ప్రధాన కూడళ్లలో పహారా కాస్తూ పటిష్టంగా లాక్డౌన్ అమలు అయ్యేలా కృషి చేస్తున్నారు.
హుస్నాబాద్‌లో కఠినంగా లాక్డౌన్ అమలు - నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
హుస్నాబాద్‌లో లాక్డౌన్ ఆంక్షలు పటిష్టంగా అమలవుతున్నాయి. ఒకవైపు కఠిన నిబంధనలు, మరోవైపు ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల జనాలు బయటకు రావట్లేదు. కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి.
హుస్నాబాద్‌లో కఠినంగా లాక్డౌన్ అమలు
అకారణంగా బయటకి వస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో