తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దుబ్బాకలో లాక్​డౌన్​ సడలింపులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో విధించిన స్వచ్ఛంద లాక్ డౌన్ సడలింపులపై వర్తక వ్యాపారస్తులు,రాజకీయ పార్టీలు, కుల, యువజన సంఘాలు ఆర్య వైశ్య భవన్​లో సమావేశమయ్యారు. శ్రావణమాసంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని షాపులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు తెరచుకుంటాయని దుబ్బాక ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ అధ్యక్షులు చింత రాజు తెలిపారు.

Lockdown relaxations at dubbaka in siddipet district
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దుబ్బాకలో లాక్​డౌన్​ సడలింపులు

By

Published : Jul 22, 2020, 2:46 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక ఆర్య వైశ్య భవన్​లో లాక్​డౌన్ సడలింపులపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని సంఘాల వారు లాక్​డౌన్ సడలింపులపై మాట్లాడి అన్ని షాపులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు తెరచుకునేట్లు అవకాశం కల్పించారు. దుబ్బాకలో కొద్ది రోజుల నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వర్తక వ్యాపారస్తులు, పార్టీలు, కుల సంఘాలు సమావేశమై కలిసి ఈ నెల 18 నుంచి 31 వరకు లాక్​డౌన్ విధించడం జరిగిందని దుబ్బాక ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ అధ్యక్షులు చింత రాజు తెలిపారు. లాక్​డౌన్ సడలింపులలో భాగంగా శ్రావణమాసంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని షాపులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు తెరుచుకుంటాయని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలలోపు అన్ని షాపులను మూసి వేయాలని వ్యాపారస్తులకు తెలియజేశారు.

మధ్యాహ్నం రెండు గంటల తరువాత మూసివేయని షాపులకు 2000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వ్యాపారస్తులకు తెలియజేశారు. అలాగే ప్రజలందరూ కూడా బయటకి వచ్చే ముందు మాస్క్ ధరించి బయటకి రావాలని... లేకుండా దుకాణాల దగ్గరికి వచ్చిన వారికి వ్యాపారస్తులు, మున్సిపాలిటీ అధికారులు జరిమానాలు విధించాలన్నారు.

ఇవీ చూడండి: కరోనా కట్టడికై సింగరేణి ప్రత్యేక ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details