లాక్డౌన్ పటిష్టంగా అమలయ్యేలా పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 10 గంటల తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీస్‌శాఖ చేత అనుమతించబడిన ఈ పాసులు కలిగి ఉన్నవారే.. రహదారులపైకి రావాలని సూచించారు. అత్యవసర పనులున్నవారు పోలీస్ శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకుని ఈ పాసులు పొందిన తర్వాతే బయటకు రావాలని ఎస్సై శ్రీధర్ సూచించారు.
'ఎవరూ బయటకు రావొద్దు.. వస్తే కఠిన చర్యలే' - telangana news updates
సిద్దిపేట జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టి.. 10 తర్వాత బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
!['ఎవరూ బయటకు రావొద్దు.. వస్తే కఠిన చర్యలే' lockdown in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:37:35:1621674455-tg-krn-102-22-policela-pahara-avb-ts10085-22052021141301-2205f-1621672981-736.jpg)
lockdown in telangana
పట్టణంలో లాక్డౌన్ సడలింపు సమయంలో 10 గంటలకు 20నిమిషాల ముందు నుంచే షాపులు దుకాణసముదాయాలు మూసివేయాలని తెలపారు. 10 తర్వాత వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా భారిన పడ్డవారు మనోధైర్యంగా ఉంటూ.. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు