రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 గంటల తర్వాత అన్ని వ్యాపార కేంద్రాలు మూసేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు రద్దీగా ఉన్న నిత్యావసర దుకాణాలు అనంతరం నిర్మానుష్యంగా మారాయి. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఏఎస్పీ మహేందర్ ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పోలీసులకు తగిన సూచనలు ఇస్తున్నారు.
హుస్నాబాద్ రోడ్లు నిర్మానుష్యం.. - తెలంగాణ వార్తలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పది గంటలలోపు రద్దీగా ఉన్న నిత్యావసర దుకాణాలు తర్వాత మూసేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఏఎస్పీ మహేందర్ ఆదేశించారు.

హుస్నాబాద్‌లో లాక్డౌన్, కరోనా వల్ల లాక్డౌన్ అమలు
అత్యవసరమైతేనే బయటకు రావాలని ఏఎస్పీ మహేందర్ ఆదేశించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ జరిమానాలు విధిస్తున్నారు. ప్రధాన రహదారులు, వీధుల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.