సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. హుస్నాబాద్‌లో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నారు. సీఐ రాఘు పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కాలినడకన వెళ్తూ.. అనవసరంగా బయట తిరుగుతున్న పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు.
బయట తిరిగేవారికి జరిమానా విధించిన పోలీసులు - సిద్దిపేట జిల్లా లేటెస్ట్ వార్తలు
అనవసరంగా బయట తిరిగే వారికి హుస్నాబాద్ పోలీసులు జరిమానా విధించారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని సీఐ రాఘు కోరారు.
బయట తిరిగేవారికి జరిమానా విధించిన పోలీసులు
వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. బయట అనవసరంగా తిరిగితే వాహనాలను సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల ఎదుట అస్తవ్యస్తంగా చెత్త పడేసిన వ్యాపారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి పలువురికి జరిమానాలు విధించారు.
ఇదీ చదవండి:అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'.. ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్!