సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలో 63 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 64 ఎంపీటీసీ స్థానాలకు కొండపాక మండలం మానగొళ్లు ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా 63 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను వేరు చేసి కౌంటింగ్ చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
గజ్వేల్ పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - local body election counting in gajwel
సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
గజ్వేల్ పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు