లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. చిరు వ్యాపారులు పెట్టుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం పీఎం స్వనిధి నుంచి ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున మంజూరు చేస్తున్నారు. సిద్దిపేటలో పండ్లు, కూరగాయలు, పువ్వులు, పానీపూరి, టీ ఇతర వ్యాపారాలు చేసే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మెప్మా అధ్వర్యంలో అలాంటి వారి వివరాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను మున్సిపల్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు కూడా సేకరించి అందులో నమోదు చేస్తున్నారు.
ప్రతి నెలా రూ.950 చెల్లించాలి..
రూ.10 వేల రుణం పొందిన వ్యాపారులు.. ప్రతి నెలా 950 రూపాయల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపేణా అదనంగా 1,140 చెల్లించాల్సి వస్తోంది. ఏడాదిలోగా అప్పు తీరిస్తే.. మళ్లీ రూ.20వేలు పొందే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.