తెలంగాణ

telangana

ETV Bharat / state

LEOPARDS VIDEO VIRAL : అక్కన్నపేటలో చిరుతపులుల సంచారం - leopars wander video viral

Leopards Wander in Siddipet : చిరుతపులుల సంచారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో అలజడి సృష్టిస్తోంది. రాత్రి పూట చిరుతల సంచారం ధర్మారం-కొండరాజుపల్లి గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

LEOPARDS VIDEO VIRAL
LEOPARDS VIDEO VIRAL

By

Published : Jul 25, 2022, 2:27 PM IST

అక్కన్నపేటలో చిరుతపులుల సంచారం

Leopards Wander in Siddipet : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చిరుతపులుల సంచారం కలకలం రేపింది. ధర్మారం-కొండరాజుపల్లి గ్రామాల మధ్య చిరుతపులులు సంచరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ తిరుగుతున్న చిరుతపులులను చూసిన వాహనదారులు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ఈ విషయమై అక్కన్నపేట ఎస్సైని వివరణ కోరగా.. చిరుతపులుల సంచారం గురించి గ్రామస్థులు తమకు సమాచారం అందించారని చెప్పారు. అటవీ శాఖ అధికారులకు తాము సమాచారం అందించామని వారు త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం ప్రజలెవరూ రాత్రిపూట బయట తిరగొద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details