తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిహారం ఇచ్చేదాకా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు జరగనిచ్చేదిలేదు' - gowrawelli project works stopped

తమకు పరిహారం చెల్లించేవరకు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు జరగనివ్వబోమని.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు బైఠాయించారు. పరిహారం జాబితాలో 40 మంది పేర్లు గల్లంతయ్యాయని.. ముంపునకు గురైన భూములకు పరిహారం చెల్లించడంతో పాటు నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

land Expats protest at gowravelli project
'పరిహారం ఇచ్చేదాకా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు జరగనిచ్చేదిలేదు'

By

Published : Jul 10, 2020, 2:51 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. దాదాపు పది నెలల తర్వాత ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టు పనుల్లో భాగంగా గౌరవెల్లి-కుందన్ వానిపల్లి, రామవరం రహదారిని కట్టపోసి మూసివేసే పనులను అధికారులు చేపట్టారు. భూ నిర్వాసితులు అడ్డుకుంటారన్న సమాచారంతో ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

విషయం తెలుసుకున్న భూనిర్వాసితులు, కులవృత్తి దారులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పనులను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో తమ భూములు పోయాయని వాటికి పరిహారం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పరిహారం జాబితాలో 40 మంది పేర్లు గల్లంతయ్యాయని... ముంపునకు గురైన భూములకు పరిహారం చెల్లించడంతో పాటు నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తమకు పరిహారం చెల్లించే వరకు పనులు జరగనివ్వమని ప్రాజెక్టు వద్ద 200 మంది భూనిర్వాసితులు బైఠాయించారు. ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని తమకు కూడా పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కుల వృత్తి దారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... ఫలితం లేకపోవటం వల్ల చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.

ఇవీ చూడండి:షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

ABOUT THE AUTHOR

...view details