తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక కల్యాణార్థం కుంకుమార్చన - కుంకుమార్చన

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ నిలయం వినాయక మండపంలో కుంకుమార్చన నిర్వహించారు. ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

కుంకుమార్చన

By

Published : Sep 7, 2019, 7:33 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ నిలయం వినాయక మండపంలో లోకకల్యాణార్థం కుంకుమార్చన నిర్వహించినట్లు అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించారు. ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని కాపాడడానికి వినాయక నవరాత్రులు ఎంతో దోహదపడతాయని అర్చకులు తెలిపారు. వినాయక మండపాలలో కుంకుమార్చన నిర్వహిస్తే అంతా శుభమే జరుగుతుందని వివరించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామన్నారు.

లోక కల్యాణార్థం కుంకుమార్చన

ABOUT THE AUTHOR

...view details