తెలంగాణ

telangana

మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

By

Published : Sep 11, 2020, 5:07 PM IST

శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

krishnashtami celebrations at mirudoddi
మిరుదొడ్డిలో సీతారామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక వేడుకలు జరిపారు. స్వామివారికి అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అభిషేకం, అర్చన, అలంకరణ, ఊంజల్​ సేవ నిర్వహించారు.

కొవిడ్​ నేపథ్యంలో భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపిక వేషధారణలో ప్రత్యేక నృత్య గీతాలతో అలరించారు. వేడుకల్లో గ్రామపెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా కేసులు, 13 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details