ఈసారి వర్షాకాలం ప్రారంభం నుంచే సమృద్ధిగా వర్షాలు పడుతుండటం వల్ల చెరువులు, కుంటలు,వాగులు అన్ని జలకళను సంతరించుకున్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వాగు గడ్డ చౌరస్తా వద్ద సమృద్ధిగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడవెల్లి వాగు పొంగి పొర్లుతూ పరవళ్లు తొక్కుతోంది. పై నుంచి వస్తున్న వరదలతో చెక్ డ్యాములు అన్ని నిండి పొంగి పొర్లుతూ అద్భుత జలపాతాన్ని తలపిస్తోంది.
ఈ అద్భుత దృశ్యాన్ని గ్రామస్థులు, అటుగా వెళ్లే ప్రయాణికులు తమ కెమెరాలలో బంధిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. చెక్ డ్యాంపై నుంచి నీరు జాలువారుతూ రాళ్ల గుట్టల మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటే వాటి మధ్య జనాలు వలలు వేసి చేపల వేట కొనసాగిస్తున్నారు.