సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఉదయం 11:30 గంటలకు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్
ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని మంత్రి సూచించారు.
ఈ నెల 29 కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్
కొండపోచమ్మ ఆలయంలో చిన్నజీయర్ స్వామితో కలిసి కేసీఆర్ హోమం నిర్వహించనున్నారని హరీశ్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగుచేసి రైతులు అధిక లాభాలు పొందాలని సూచించారు. నియంత్రిత పంటల సాగు కాదు... ప్రాధాన్యత పంటల సాగు చేయాలని తెలిపారు.
ఇదీ చూడండి:మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్