తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగరంగ వైభవంగా కొండపోచమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​లోని కొండపోచమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3నెలల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

Kondapochamma Brahmotsavalu begins with the glory in siddipet district
అంగరంగ వైభవంగా కొండపోచమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

By

Published : Jan 18, 2021, 8:45 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​ మండలం తీగుల్ నర్సాపూర్​లోని కొండపోచమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కల్పవల్లిగా పిలుచుకొనే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.

భక్తులు కొత్తకుండలో నైవేద్యం తయారుచేసి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించుకున్నారు. మంగళవారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3నెలల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఆలయ చరిత్ర...

కొమురవెల్లి మల్లన్న సోదరి అయిన కొండపోచమ్మ ఒక సారి అన్నపై అలిగిందట. అప్పుడు అక్కడి నుంచి వెళ్లి జగదేవ్​పూర్​ మండలం తీగుల్ నర్సాపూర్​లోని గిరులపై వెలసినట్లు చరిత్ర చెబుతోంది. కొమురవెల్లిలో మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

ఇదీ చదవండి:లక్ష్మీదేవిపేట్ సర్పంచ్​పై హైకోర్టు ఆగ్రహం.. 50 వేల జరిమాన

ABOUT THE AUTHOR

...view details