సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జడ్పీ ఛైర్మెన్ వేలేటి రోజా శర్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
'విద్యార్థులు బాపూజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి'
సిద్దిపేట జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
'విద్యార్థులు బాపూజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి'
ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అని ఛైర్మన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లిన మహానుభావుడంటూ కొనియాడారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి ముందుకు రావాలని కోరారు.
ఇదీచూడండి:కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం: కేసీఆర్