తెలంగాణ

telangana

ETV Bharat / state

22రోజుల్లో రూ.కోటి 3లక్షలు.. భారీగా కొమురవెల్లి ఆదాయం - కొమురవెల్లి మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం చేపట్టారు. స్వామి వారికి 22 రోజుల్లో రూ. కోటి 3 లక్షలకు పైగా ఆదాయం చేకూరినట్లు ఆలయ ఈఓ బాలాజీ తెలిపారు.

komuravelli temple
కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

By

Published : Feb 24, 2021, 9:18 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఆలయ ఈఓ బాలాజీ, పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ దువ్వల మల్లయ్య, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్ సమక్షంలో లెక్కింపు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలో ఈ ప్రక్రియ కొనసాగింది.

కేవలం 22 రోజుల్లో మల్లన్నకు హుండీల ద్వారా రూ. కోటి 3 లక్షల 59 వేల 877 ఆదాయం సమకూరింది. 130 గ్రాముల మిశ్రమ బంగారం, 12 కిలోల మిశ్రమ వెండి ఆభరణాలు స్వామి వారికి కానుకలుగా చేరాయి. ఇంత తక్కువ వ్యవధిలో పెద్ద మొత్తంలో హుండీల ద్వారా ఆదాయం రావడం ఆలయ చరిత్రలోనే మొదటి సారి అని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:చిన్న బడులు తెరవాలని ఉపాధ్యాయ సంఘాల వినతి

ABOUT THE AUTHOR

...view details