తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు - కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

కోరుకున్న భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నెలల పాటు జరిగే మల్లన్న జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామివారి దర్శించుకుంటారు.

komuravelli mallikarjuna swamy brahmothsavalu start today onwards
నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

By

Published : Jan 17, 2021, 6:10 AM IST

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల్లోని మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు అందుకే... పట్నం వారమని అంటారు. శనివారం వచ్చే పట్నం వాసులు సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే బస చేస్తారు.

ఆదివారం స్వామివారి దర్శించుకోవడం, బోనాలు, నైవేద్యం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక సోమవారం హైదరాబాద్ భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. సుమారు యాభై వేలకు పైగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:కరోనా టీకా పంపిణీపై సైకత శిల్పం

ABOUT THE AUTHOR

...view details