భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న మూల విరాట్ దర్శనం ఈనెల 16 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ వెల్లడించారు. ఈనెల 22వ తేదీ ఆదివారం రోజున స్వామివారి కళ్యాణంతో పాటు జాతర ప్రారంభోత్సవం సందర్భంగా గర్భగుడిలో స్వామి వారు అమ్మవార్ల మూలవిరాట్ విగ్రహాల అలంకరణ కార్యక్రమం చేపడుతున్నారు.
ఈ నెల 22 వరకు కొమురవెల్లి మల్లన్న దర్శనం నిలిపివేత
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి నిజరూప దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 22 వరకు కొమురవెల్లి మల్లన్న దర్శనం నిలిపివేత
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అర్థ మండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 22వ తేదీ ఉదయం వరకు స్వామి వారి నిజదర్శనం ఉండదని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: ధనుర్మాసం... కోరిన వరుడు వస్తాడని ఆడపిల్లల విశ్వాసం..!