సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న జాతర ఆద్యంతం కోలాహలంగా జరుగుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని.. రెండో వారం కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోరమీసాల స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.
భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకుని డోలు చప్పుళ్ల మధ్య ప్రదక్షిణలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. శివసత్తుల పూనకాల నడుమ.. శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి.