తెలంగాణ

telangana

ETV Bharat / state

చేర్యాలలో కోమటిరెడ్డి, కోదండరాం భారీ ర్యాలీ - loksabha

పార్లమెంట్​ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. భారీ ర్యాలీలు తీస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సీనియర్​ నేతలు ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్​ నేత కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, తెజస అధినేత కోదండరాం భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రచారంలో నిమగ్నమైన నేతలు

By

Published : Mar 29, 2019, 4:27 PM IST

ప్రచారంలో నిమగ్నమైన నేతలు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీ పీసీసీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఒగ్గు డప్పు చప్పుళ్లతో, లంబాడి నృత్యాలతో బచ్చనపేట, చేర్యాల, మద్దూరు మండలాల కార్యకర్తలు సన్నాహక సమావేశానికి బయలుదేరారు.

ABOUT THE AUTHOR

...view details