తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన - కేంద్ర జలశక్తి అభియాన్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో కేంద్ర జలశక్తి అభియాన్ సాంకేతిక నిపుణుల బృందం పర్యటించింది. నాలుగు రకాల నీటి సంరక్షణ పథకాలను, విధానాలను పరిశీలించింది.

సిద్దిపేట జిల్లా ఎనగుర్తిలో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన

By

Published : Aug 19, 2019, 3:02 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో కేంద్ర జలశక్తి అభియాన్ సాంకేతిక నిపుణుల బృందం పర్యటించింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోరు బావి రీఛార్జీ ఫిట్​, ఇంకుడు గుంత పనులను పరిశీలించింది. గ్రామ శివారులో గ్రామస్థులతో కలిసి సాంకేతిక నిపుణుల సభ్యులు మొక్కలు నాటారు. రైతుల పొలాల్లోని ఫామ్ పాండ్​ను పరిశీలించారు. నీటి నిల్వ సామర్థ్యం, అందులోని నీటిని పంట పొలాలకు ఉపయోగించే తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం బోరు బావి రీఛార్జీ ఫిట్​లో ఎనిమిది మీటర్ల మేర నీళ్లు ఉన్నాయని సాంకేతిక నిపుణులు డాక్టర్ సెంథిల్ కుమార్ తెలిపారు. మరోసారి పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఈ నీటి నిల్వ ఎంత మేరకు పెరుగుతుందో తెలుసుకుంటామన్నారు. కేంద్ర జలశక్తి అభియాన్​లో భాగంగా ఎనగుర్తి గ్రామంలో నీటి సంరక్షణకు సంబంధించి 5 రకాల కార్యక్రమాలు చేపట్టామని దుబ్బాక ఎంపీడీవో మల్లికార్జున్, గ్రామ సర్పంచ్​ గుండా శంకర్ పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా ఎనగుర్తిలో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన

ఇదీ చూడండి :రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు

ABOUT THE AUTHOR

...view details