సిద్దిపేట జిల్లా వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వంటిమామిడి కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన సీఎం... అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏజెంట్ రూ.10 కమీషన్ తీసుకుంటున్నారని రైతులు సీఎం కేసీఆర్‌కు చెప్పారు.
'వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం' - సీఎం కేసీఆర్ వార్తలు
సిద్దిపేట వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు.
kcr
ఏజెంట్లు రూ.4 కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వంటి మామిడిలో 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు విత్తనాల కోసం ఆగ్రా, దిల్లీకి వెళ్లే సమస్య లేకుండా చేస్తామన్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతులకు ఇక్కడే విత్తనాలు అందజేస్తామని పేర్కొన్నారు. రైతుల కోసం వంటిమామిడి మార్కెట్‌లో ఏటీఎం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :43 శాతం ఫిట్‌మెంట్ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు
Last Updated : Jan 27, 2021, 7:05 PM IST