కొండపోచమ్మ జలాశయం ప్రాంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సతీసమేతంగా చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు - కొండపోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం
కాళేశ్వరగంగను ఒడిసిపట్టేందుకు కొండపోచమ్మ సాగరం ముస్తాబైంది. మరికాసేపట్లో కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో... ఆయన కొండపోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్