సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే ఆలయాలకు వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ఎలాంటి తోపులాట జరగకుండా కమిటీ సభ్యులు తగిన జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేశారు.
కార్తిక పౌర్ణమి వేళ.. దీపారాధన చేసిన భక్తులు - KARTHIKA POURNAMi celebrations at siddipeta
కార్తిక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్తిక పౌర్ణమి వేళ.. దీపారాధన చేసిన భక్తులు