'మహాత్ముడి చరిత్రను రాబోయే తరాలకు అందిస్తాం' - bjp mp bandi sanjay in gandhi sankalp yatra
మహాత్మా గాంధీ చరిత్రను కనుమరుగు చేసి నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల చరిత్రను తెరపైకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

హుస్నాబాద్‌లో గాంధీ సంకల్ప యాత్ర
హుస్నాబాద్‌లో గాంధీ సంకల్ప యాత్ర
భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చేరుకుంది. మహాత్ముడి చరిత్రను రాబోయే తరాలకు అందించడానికే ఈ యాత్ర చేపట్టినట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులనే గ్రామపంచాయతీలకు కేటాయిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల డిమాండ్‌కు భాజపా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : బాగ్దాదీ మరణం పట్ల ప్రపంచ దేశాల హర్షం