'పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి' - దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల విషయంలో అవకతవకలకు ఆస్కారం లేదని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యాక... దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'అవకాశం వచ్చింది.. వినియోగించుకో సంజూ'