తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం మరో పంప్‌హౌస్ వెట్​రన్ సఫలం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో కీలక పంప్‌హౌస్​ను పరీక్షించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అక్కారం వద్ద ఉన్న పంప్‌హౌస్ వెట్​రన్ విజయవంతమైంది.

Kaleshwaram is another pump house wet run success at akkaram
కాళేశ్వరం మరో పంప్‌హౌస్ వెట్​రన్ సఫలం

By

Published : May 19, 2020, 8:33 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. గజ్వేల్ మండలంలోని అక్కారం వద్ద ఉన్న పంప్‌హౌస్ వెట్​రన్ విజయవంతమైంది. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పూజలు చేసి అక్కారం పంపు ప్రారంభించారు.

ఈ ప్రక్రియ ద్వారా మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి గోదావరి నీటి తరలింపునకు నాందిపడింది. అక్కారం పంప్ హౌస్ నుంచి కాళేశ్వర జలాలు కాల్వల ద్వారా మర్కుక్ పంప్ హౌస్‌కు చేరాయి. సీఎం కేసీఆర్​ త్వరలోనే మర్కుక్ పంప్ హౌస్ వెట్‌రన్ ప్రారంభించి కొండపోచమ్మ జలాశయంలోకి గోదావరి జలాల పంపింగ్ ప్రారంభిస్తారు.

కాళేశ్వరం మరో పంప్‌హౌస్ వెట్​రన్ సఫలం

ఇదీ చూడండి :వరి ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details