సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కళాజాత బృందం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర కళా బృందానికి చెందిన కళాకారులు కరోనా వైరస్‌పై ఆట పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కరోనా భూతం పేరిట వేషధారణతో ఆటపాటలు ప్రదర్శించారు.
కరోనాపై కళాజాత బృందం అవగాహన - కరోనా వైరస్ నివారణ
సిద్దిపేట హుస్నాబాద్‌లో కరోనా నివారణపై వీరబ్రహ్మేంద్ర కళా బృందం ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టండంటూ పాటలు పాడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.
కరోనాపై కళాజాత బృందం అవగాహన
చైనా నుంచి భారత దేశానికి కరోనా వచ్చిందని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. కరోనా భూతాన్ని తరిమి కొట్టండి అంటూ పాటలు పాడారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ ప్రదర్శనను ప్రజలు ఎంతో ఆసక్తితో తిలకించారు.
ఇవీ చూడండి:కరోనా @110: భారత్‌ను కలవరపెడుతోన్న కొవిడ్-19 కేసులు