తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి పోషణ చూడని కుమారులకు జ్యుడిషియల్ రిమాండ్​ - తండ్రి పోషణ చూడని కోడుకులపై కేసు నమోదు

వృద్ధాప్యంలో ఉన్నతండ్రి మంచిచెడులు చూసుకోవాల్సిన కొడుకులు మానవత్వం మరిచారు. దీంతో ఆ ముగ్గురు కుమారులపై సిద్దిపేట జిల్లా కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్​కు పంపించారు.

Judicial remand for sons who did not caring they father in siddipet district
తండ్రి పోషణ చూడని కుమారులకు జ్యుడిషియల్ రిమాండ్​

By

Published : Aug 5, 2020, 11:47 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనిగరం మధిర గ్రామం శంకర్​నగర్​కు చెందిన వృద్ధుడు పోతు మల్లయ్యకు ముగ్గురు కొడులు రవీందర్ (52), జనార్ధన్ (48), రవీందర్(45). ఏడాది క్రితం ఒక్కొక్కరికి సుమారు రూ. కోటి చొప్పున ఆస్తులు పంచి ఇచ్చాడు. ఇప్పుడు ఎవ్వరు కూడా తండ్రిని పోషించడానికి ముందుకు రాలేదు. గ్రామ పెద్దలు పంచాయితీ చెప్పినా మేము పోషించని ఖరాఖండీగా చెప్పారు.

ఈ విషయమై మల్లయ్య హుస్నాబాద్ ఆర్డీవోకు కొడుకులపై ఫిర్యాదు చేశాడు. వారికి ఆర్డీవో కౌన్సెలింగ్ నిర్వహించినా ససేమిరా అన్నారు. కోహెడ ఎస్సై రాజకుమార్ సహాయంతో గ్రామ పెద్దలు అంకిరెడ్డిపల్లి వృద్ధాశ్రమంలో చేర్పించారు. గత నెల మల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. నాలుగు రోజుల క్రితం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడని ఎస్సై... కొడుకులకు సమాచారం అందించగా ఎవరు కూడా ఆస్పత్రికి వచ్చి తండ్రిని చూడలేదు.

ఈ విషయం గురించి గ్రామ వీఆర్వో దరఖాస్తు ఇవ్వగా ఎస్సై కేసు నమోదు చేసి ఇవాళ ముగ్గురు కొడుకులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. కనిపెంచిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కొడుకుపై ఉంటుందని.. మనజన్మకు కారణమైన వారిని పోషించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోహెడ ఎస్సై హెచ్చరించారు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details