తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు యువతే బలం : ఆర్థిక మంత్రి హరీశ్​రావు - minister harish rao latest news

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో మంత్రి హరీశ్​రావు సమక్షంలో భాజపా కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అందరికీ మంచి చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.

trs joinings in presence of minister harish rao
'యువకులే తెరాస సైనికులు': మంత్రి హరీశ్​రావు

By

Published : Oct 10, 2020, 2:27 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్​, రాయ్​పోల్ మండలం అనాజ్​పూర్​, తిమ్మక్కపల్లికి చెందిన భాజపా యువకులు మంత్రి హరీశ్​రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు గులాబీ తీర్థం పుచ్చుకోవడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలెవరికి ఎలాంటి అవసరమొచ్చినా తాను, రామలింగన్న అండగా నిలిచామని హరీశ్​రావు గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి సొంత ఖర్చులతో కోచింగ్​ సెంటర్లను పెట్టి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపామని మంత్రి తెలిపారు. ఇవన్నీ జరిగిన వాస్తవాలే కానీ కాంగ్రెస్​, భాజపా లాగా కళ్లిబొల్లి మాటలు కాదని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండిఃఉత్తమ్​ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details