అధికార తెరాస పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలో కాంగ్రెస్, భాజపా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గులాబీగూటికి చేరుతున్నారు.
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరికలు - తెరాస పార్టీలోకి చేరికలు తాజా వార్తలు
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాస పార్టీలోకి వివిధ పార్టీ నాయకులు చేరారు. ఆయన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
![మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరికలు Joined trs in the presence of Minister Harish Rao at siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9024108-11-9024108-1601646831421.jpg)
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాసలోకి చేరికలు
సిద్దిపేట పట్టణం పద్మనాయక కల్యాణ మండపంలో దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం అల్వాల్, మల్లుపల్లి, చెప్యాల గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.