తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం - Jarkhand Officers visit Siddipeta district

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యదర్శి సునీల్ కుమార్ అభినందించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజవర్గంలో ఎర్రవల్లి, ప్రజ్ఞాపూర్ గ్రామాల్లో పర్యటించారు.

jarkhand-officers-visit-siddipeta-district
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం

By

Published : Dec 9, 2019, 3:00 PM IST

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ అద్భుతంగా ఉందని.. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యదర్శి సునీల్ కుమార్ అభినందించారు. ఈ పథకం అమలుపై ఝార్ఖండ్ ప్రభుత్వం ఆసక్తిగా ఉండటం వల్ల ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలనకు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎర్రవల్లి, ప్రజ్ఞాపూర్​లో మిషన్ భగీరథ నల్లాలను పరిశీలించారు.

నీటి సరఫరా, నాణ్యతపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవల్లి, ములుగులో నిర్మించిన రెండు పడగ గదుల ఇళ్లను పరిశీలించారు. అనేక పట్టణాల కంటే ఎర్రవల్లి గ్రామంలో మౌలికవసతులు బాగున్నాయని సునీల్ కుమార్ పేర్కొన్నారు.

మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం


ఇవీచూడండి: కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం

ABOUT THE AUTHOR

...view details