సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, గజ్వేల్ ప్రాంతాల్లో ఝార్ఖండ్ సీఎంవో కార్యదర్శి సునీల్‌కుమార్ పర్యటించారు. మిషన్ భగీరథ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోమటిబండలోని భగీరథ హెడ్ వర్క్స్ పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెంపుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి మిషన్ భగీరథ పథకమే నిదర్శనమని కొనియాడారు. నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఎస్.ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో ఝార్ఖండ్ సీఎంవో కార్యదర్శి పర్యటన - సిద్దిపేటలో పర్యటించిన ఝార్ఖండ్ సీఎంవో కార్యదర్శి
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం పనితీరును ఝార్ఖండ్ సీఎంవో కార్యదర్శి సునీల్‌కుమార్ పరిశీలించారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

సిద్దిపేటలో ఝార్ఖండ్ సీఎంవో కార్యదర్శి పర్యటన
సిద్దిపేటలో ఝార్ఖండ్ సీఎంవో కార్యదర్శి పర్యటన
ఇవీచూడండి: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టేదెన్నడో...?