సోషల్ మీడియాలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ఉపాధ్యాయుడు యామ రాజు చేపట్టిన రైస్ బ్యాగ్ ఛాలెంజ్‌కు దాతలు స్పందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వీఎల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో... హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన 125 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు, మాస్కులను పంపిణీ చేశారు.
'ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది' - JAC president manjula reddy helped private teachers in husnabad
ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిత్యం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒక గురువు అవసరం ఉంటుందని అలాంటి గురువులకు కరోనా ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టిందని జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు కర్ణకంటి మంజులా రెడ్డి అన్నారు. అలా కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
!['ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది' JAC Telangana state president helped private teachers in husnabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8691366-731-8691366-1599307825319.jpg)
రెండు లక్షల రూపాయలతో ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులను జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులారెడ్డి అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు రైస్ బ్యాగ్ ఛాలెంజ్‌కు స్పందించిన దాతలందరికీ అభినందనలు తెలిపారు. మూడు మండలాలతో పాటు నియోజకవర్గంలో మిగిలిన 4 మండలాల ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
భావిభారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో కీలకమైన ఉపాధ్యాయులు కరోనా వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు.
- ఇవీ చూడండి:మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్