తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ఇంటర్​ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఫెయిలైనందున మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

inter student suicide in gajwel
ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Jun 18, 2020, 10:16 PM IST

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీశైలం అనే ఆటో డ్రైవర్ కూతురు ప్రవళ్లిక... ఓ ప్రైవేటు కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఓ సబ్జెక్టు తప్పింది. మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

గదిలోకి వెళ్లిన కూతురు చాలా సేపటి వరకు రాలేదని తల్లిదండ్రులు తలుపులు తీసి చూడగా... ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఇంటర్​ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details