తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ పరీక్ష ప్రశ్నాపత్రం తారుమారు - latest news on latest news on Inter exam questionnaire manipulation at mirudoddi in siddipet

మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం​ ప్రశ్నాపత్రం తారుమారైంది. చివరికి 75 నిమిషాల తర్వాత ఇచ్చిన అసలు ప్రశ్నాపత్రంతో విద్యార్థులు పరీక్ష రాశారు.

Inter exam questionnaire manipulation at mirudoddi in siddipet
ఇంటర్​ పరీక్ష ప్రశ్నాపత్రం తారుమారు

By

Published : Mar 15, 2020, 5:17 PM IST

Updated : Mar 15, 2020, 6:05 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష పత్రం తారుమారైంది. ఎంపీహెచ్‌డబ్ల్యూ విద్యార్థినులకు ప్రైమరీ హెల్త్‌ నర్సింగ్‌ ప్రశ్నాపత్రానికి బదులుగా బయోకెమిస్ట్రీ పేపరు ఇచ్చారు. ఫలితంగా స్థానిక కస్తూర్బా విద్యాలయానికి చెందిన 39 విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. విషయం ఇంటర్​​​ విద్యాధికారి సుధాకర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. 75 నిమిషాల అనంతరం విద్యార్థులకు అసలు పశ్నాపత్రం ఇచ్చారు.

ఇందుకు గానూ విద్యార్థులకు అదనంగా 1గంట 15నిమిషాల సమయం ఇవ్వడం వల్ల పరీక్ష సజావుగా సాగింది. ఇంటర్‌ బోర్డు సరఫరా చేసిన పరీక్ష పత్రాల బండిల్‌పై ముద్రించిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రం ఇవ్వగా.. అక్కడే తేడా వచ్చినట్లు డిపార్ట్‌మెంట్ అధికారి రమాదేవి గుర్తించారు. విషయాన్ని ఇంటర్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.

ఇంటర్​ పరీక్ష ప్రశ్నాపత్రం తారుమారు

ఇదీ చూడండి:తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్​ రెడ్డి

Last Updated : Mar 15, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details