తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లపై అవగాహన కల్పిస్తోన్న కరోనా భూతం.. - siddipet latest news

నిబంధనలు గాలికొదిలేసి.. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని దూసుకుపోతున్న వాహన దారులకు ఒక్కసారిగా కరోనా భూతం ఎదురైంది. ఎన్ని సార్లు చెప్పినా మీతీరు మారదా...ప్రధాని, ముఖ్యమంత్రి అన్ని కష్టాలు పడుతుంటే మీరేమో ఇలా... బాధ్యత ఉండక్కర్ల అంటూ హెచ్చరిస్తోందా భూతం.

Innovative awareness on corona in Siddipet
రోడ్లపై అవగాహన కల్పిస్తోన్న కరోనా భూతం..

By

Published : Mar 31, 2020, 4:46 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. వాహన దారులకు బాధ్యతలను గుర్తుచేస్తూ వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు.

రోడ్లపై అవగాహన కల్పిస్తోన్న కరోనా భూతం..

పట్టణానికి చెందిన కళాకారుడు వెంకటేశం కరోనా భూతం వేషధారణలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి అవగాహన కల్పిస్తున్నాడు. పోలీసులు, డాక్టర్లు చేస్తున్న సేవకు తోడుగా తన వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని వెంకటేశం తెలిపాడు.

ఇవీ చూడండి:క్వారంటైన్​కు కొత్త రూల్- గంటకో సెల్ఫీ తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details