సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఎవరి ఇంటిముందు చూసినా రంగురంగుల ముగ్గులు చూపరులను ఆకట్టుకుంటాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లునాయక్ తండాలో మొదటిసారి పొదుపుసంఘం ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో యువతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బల్లునాయక్ తండాలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు - సిద్దిపేట జిల్లాలో ఆకట్టుకున్న రంగవల్లుల పోటీలు
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా రంగవల్లులు దర్శనమిస్తాయి. పల్లెలు, పట్టణాల్లో ఇళ్ల ముంగిళ్లు రంగులతో నిండిపోతాయి. ఇంకా అతివల ముగ్గుల పోటీలు సర్వసాధారణం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లునాయక్‌తండాలో మొదటిసారి నిర్వహించిన ముగ్గుల పోటీల్లో యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బల్లునాయక్ తాండాలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
యువతులు, మహిళలకు రెండు విభాగాలుగా పోటీలు నిర్వహించారు. రంగురంగులతో ఆకర్షణీయంగా వేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీల్లో అద్భుతంగా ముగ్గులు వేసి ప్రతిభ కనబరిచిన యువతులకు, మహిళలకు అక్కన్నపేట జడ్పీటీసీ మంగ, ఎంపీపీ మానస, హుస్నాబాద్ ఎస్సై శ్రీధర్ జడ్జీలుగా వ్యవహరించి బహుమతులను ప్రదానం చేశారు. తొలిసారి ముగ్గుల పోటీలు నిర్వహించగా గ్రామంలో సందడి నెలకొంది. దీంతో యువతులు, మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.