తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన - latest news on Impressive educational science show

హుస్నాబాద్​లోని ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Impressive educational science show
ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

By

Published : Feb 3, 2020, 7:35 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫేర్) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 250 రకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. వాటి పనితీరును వీక్షకులకు వివరించారు.

హైడ్రాలిక్ క్రేన్, డ్రోన్, వన్య ప్రాణుల నుండి పంటలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గంట, మ్యాగ్నెటిక్ లైట్, మంకీ గన్, గ్లోబల్ వార్మింగ్ మొదలగు నమూనాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్​పర్సన్ ఆకుల రజిత వివిధ నమూనాలను పరిశీలించి.. విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఇన్నారెడ్డి తెలిపారు.

ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

ఇవీ చూడండి:అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details