సిద్దిపేట జిల్లా చేర్యాల పురపాలక సంఘం పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పట్టణంలో పర్యటించారు. కుడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండటం గమనించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుడి చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత - అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సిద్దిపేట జిల్లా చేర్యాల కుడి చెరువు పూర్తి నిల్వ సామర్థ్య స్థలం(ఎఫ్టీఎల్) పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండడానికి పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.
చేర్యాల కుడి చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత
అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించకపోతే.. సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. దీనితో.. చేర్యాల పురపాలక సంఘం అధికారులు ఈరోజు ఉదయం చెరువు పరిధిలో నిర్మిస్తున్న ఇళ్లను తొలగించారు. శాంతి భద్రతల సమస్య రాకుండా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష