సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం సహా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఓ వైపు ఎండలు అధికంగా మండుతూ... రెండు మూడు రోజులుగా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణం చల్లబడి జిల్లా వాసులకు ఉపశమనం లభించింది.
హుస్నాబాద్‌లో వడగళ్ల వర్షం...ఆందోళనలో రైతులు - VADAGANDLA VAANA
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో భారీ వడగళ్ల వర్షం కురిసింది. తమ పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
హుస్నాబాద్‌లో భారీ వడగళ్ల వాన
మరోవైపు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు వడగళ్ల వర్షంతో పంటకు నష్టం జరుగుతుందోనని ఆందోళనకు లోనవుతున్నారు. మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని... వాతావరణ శాఖ వెల్లడించింది.