ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
'నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం భోజనం పెడతా' - ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ ఉదారతను చాటుకున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సొంత ఖర్చుతో ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ఇటీవలి మంత్రి హరీశ్‌రావు హుస్నాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. తమకు మధ్యాహ్న భోజనం పెట్టమని విద్యార్థులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సతీశ్ కుమార్.. నియోజకవర్గంలోని పాఠశాల, కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు.
ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన నియోజకవర్గంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తానని సతీశ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం వసతి గృహంలో ఉంటున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి : 'దిశ'ది సాయం చేసే గుణం