కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ కుటుంబాన్ని పెద్దమనసుతో ఆదుకున్నాడు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్. ఆస్పత్రి బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి రూ.లక్ష సాయం అందించి ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన మేకల కాపరి వెంకటేశ్(32)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చేర్పించగా నరాలకు సంబంధించిన జీబీఎస్ వ్యాధి సోకిందన్నారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.16 వేలతో నాలుగు రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
మేకల కాపరి కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే
కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ కుటుంబాన్ని పెద్దమనసుతో ఆదుకున్నాడు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్. ఆస్పత్రి బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి రూ.లక్ష సాయం అందించి ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన మేకల కాపరి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు.
అతని పరిస్థితి విషమించడంతో ఒమేగా ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల చికిత్సకు రూ.1,57,000 బిల్లు వచ్చింది. అంత డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. వారి వద్ద కేవలం రూ.40 వేలే ఉండగా వారి గ్రామ సర్పంచ్ గాజుల రమేశ్ చొరవతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.లక్ష నగదును కుటుంబసభ్యులకు అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన బైరి వెంకటేశ్ ఇంటికి వెళ్లి కో ఆప్షన్ సభ్యుడు మాధవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల మల్లయ్య, సర్పంచ్, వార్డు సభ్యులు పరామర్శించారు. ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యేకు వారి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.